ఆర్‌టిసి కాంప్లెక్స్‌ అభివృద్ధికి కృషి

మాట్లాడుతున్న డిసి అసిస్టెంట్‌ మేనేజర్‌

ప్రజాశక్తి-రావికమతం:మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ప్రయాణికుల సౌకర్యవంతంగా తీర్చి దిద్దుదామని డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌ఎస్‌ నాయుడు తెలిపారు. మండల కేంద్రంలో అద్దెకు ఇచ్చిన కాంప్లెక్స్‌ను ఆవరణను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఆర్టీసీ కాంప్లెక్స్‌లో షాపులలో అగ్రిమెంట్‌లో ఉన్న షాపులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఇకపై ఈ కాంప్లెక్స్‌ ఆవరణలో విధిగా బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సూపర్వైజర్‌ అధికారిని ఇక్కడ విధుల్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీలింగ్‌ ఫ్యాన్లు కూడా అమర్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ప్రయాణికులు తాకిడి పెరిగితే తాగునీరు, టాయిలెట్‌, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ తనిఖీలో ఇంజనీరింగ్‌ విభాగం డీఈ నర్సింగరావు, విజిలెన్స్‌ అధికారులు చిట్టిబాబు, అప్పారావు ఉన్నారు.

➡️