ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి

Jan 23,2024 00:06
నక్కపల్లిలో మాట్లాడుతున్న రామలక్ష్మి

ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి తహసిల్దార్‌ కార్యాలయంలో సోమవారం పాయకరావుపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కే.రామలక్ష్మి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్‌ జాబితా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.ఓటర్‌ జాబితా పక్కగా ఉండే విధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ లు ఎస్‌వి అంబేద్కర్‌, జై ప్రకాష్‌, జానకమ్మ, పలు రాజకీయ పార్టీల నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్‌, వీసం నానాజీ, మేడిటి శంకర్‌, రమణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు .ఓటర్ల తుది జాబితా ప్రదర్శన కోటవురట్ల:రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ఓటర్ల తుది జాబితాను తహసిల్దార్‌ జానకమ్మ సోమవారం కార్యాలయం వద్ద ప్రదర్శించారు. అనంతరం బూత్‌ లెవెల్‌ అధికారులకు అందజేశారు. గ్రామాల్లో అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రదర్శించారు. ఈ సందర్భంగా తహసిల్దార్‌ జానకమ్మ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా 52 పోలింగ్‌ బూత్‌ కేంద్రాలకు పురుషులు 21422, మహిళలు 22391 కలిసి మొత్తం 43813 మంది ఉన్నట్లు తెలిపారు.ఈ నెల 25న ఓటర్‌ దినోత్సవ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బూత్‌ లెవెల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️