కదం తొక్కిన అంగన్వాడీలు

విశాఖలో మోకాళ్లపై నిరసన

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగంప్రభుత్వం అంగన్‌వాడీలపై బెదిరింపు చర్యలకు పాల్పడినా ఆందోళనలతో ముందుకు సాగుతున్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలోని పలు చోట్ల అధికారులు కేంద్రాలకు తాళాలు వేస్తుండటంతో ఆయా పార్టీల నేతలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అనకాపల్లి:దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏడు రోజులుగా సమ్మె అంగన్వాడీలు సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ముందుగా పట్టణంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి, తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లకు ఇవ్వాలని, ఐసిడియస్‌కు బడ్జెట్‌ పెంచాలని, ప్రీస్కూల్‌ బలోపేతం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.నాగశేషు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌ శంకరరావు, ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, ఐద్వా జిల్లా అధ్యక్షులు పి మాణిక్యం, యూనియన్‌ నాయకులు కె.కాసులమ్మ, కె.రామలక్షి, కె.తనుజ, బి జయలక్ష్మి కె.కృష్ణవేణి, భవాని, ఎం. రమణి, ఎం. వరలక్ష్మి, గంటా శ్రీరామ్‌, బుగిడి నూకప్పారావు పాల్గొన్నారు. మునగపాక రూరల్‌ : అధికార వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌ బ్రహ్మాజీ టిడిపి, జనసేన పార్టీల మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు, టెక్కలి పరశురాములు అధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎంపీపీ స్కూల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు వెళ్లిన ఎండిఓ మన్మధరావు, డిటి వినరు కుమార్‌, సచివాలయ బృందాన్ని వారు అడ్డుకున్నారు. ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ అన్నపూర్ణ, సచివాలయ కానిస్టేబుల్‌ వరలక్ష్మి, వాలంటీర్లతో వాగ్వాదానికి దిగారు. తలుపులకు అడ్డంగా కూర్చొని నినాదాలు చేశారు. తలుపులు తెరిస్తే ప్రతిఘటన చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో పోలీసులను రప్పించి వారి సహాయంతో సుత్తితో తాళం కప్పను విడగొట్టి తలుపులను తెరిచారు. టిడిపి సీనియర్‌ నాయకులు దాడి ముసలి నాయుడు, జనసేన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీకాంతు రైతు సంఘం నాయకులు ఆడారి మహేష్‌, ఆడారి లక్ష్మణరావు, దాడి శివ పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రాన్ని బలవంతంగా తెరిచిన అధికారులుబుచ్చయ్యపేట : ఏడు రోజులుగా వారు సమ్మెలో పాల్గొంటే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి కేంద్రాలను స్వాధీనం చేసుకోవడంలో అధికారులు నిమగమయ్యారు. మండలంలో 62 అంగన్వాడీ కేంద్రాలకు సోమవారం నాటికి 30 అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. సోమవారం మండలంలోని వడ్డాదిలో ఐదు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి ఈవో లవరాజు సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అంగన్వాడీ కేంద్రాలను తెరిసినా తల్లిదండ్రులు తమ పిల్లల ఏమాత్రం పంపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో పిల్లల తల్లిదండ్రులు, అధికారుల చర్యలను అడ్డుకుంటున్నారు. నక్కపల్లి:అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి అంగన్వాడీ కేంద్రాలను అధికారులతో బలవంతంగా తెరిపించే ప్రయత్నంకు ఎక్కడికక్కడ ప్రతిఘటన ఎదురైంది. మండలంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు అంగన్వాడి కేంద్రాలను తెరిపించేందుకు ప్రయత్నం చేయగా టిడిపి శ్రేణులు, కొంతమంది స్థానికులు అడ్డుతగిలారు. చందనాడ, న్యాయంపూడి, బంగారమ్మపేట, రేబాక, రమణయ్యపేట, గుల్లిపాడు, బుచ్చిరాజుపేట, ఎన్‌ నర్సాపురం, కాగిత, నెల్లిపూడి, అమలాపురం, తదితర గ్రామాల్లో టిడిపి శ్రేణులు అంగన్వాడీ కేంద్రాలను తెరవకుండా అడ్డుకున్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే వరకు కేంద్రాలను తెరవనీయబోమని స్పష్టం చేశారు.నర్సీపట్నం టౌన్‌ :అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో నర్సీపట్నం ప్రధాన రహదారులు ఎర్ర జెండాలతో జన సముద్రం గా మారింది. 7వ రోజు నిరసనలో భాగంగా ఆర్‌డిఓ కార్యాలయం వద్ద సోమవారం దర్నా విజయవంతమైంది. ప్రభుత్వం స్వందించకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నినాదాలతో బ్యారీ ర్యాలీగా వచ్చి కార్యాలయం ముందు బైఠాయించి దర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికలలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హమీలు మరచి సమ్మెలో ఉన్నవారిని బెదిరించి, భయబ్రాంతులతో విచ్చినం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఏపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాతూ,అంగన్‌వాడీలపై వైసిపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో లేకపోతే తగిన బుద్ధి చెబుతామన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ, అంగన్‌వాడీలపై జగన్‌ మోహన్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ఏపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు దుర్గారాణి, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు మీసాల సుబ్బన్న, నాన్‌ షెడ్యూల్‌ గిరిజన సంఘం జిల్లా నాయకులు కె.గోవిందరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, మండల కన్వీనర్‌ ఈశ్వరరావు, వి.సామ్రాజ్యం, మహలక్ష్మీ, సిహెచ్‌.బ్రమరాంబ, మంగ, పద్మజ, కృష్ణవేణి పాల్గొన్నారు. ప్రభుత్వ తీరు దారుణం రావికమతం:పంచాయతీ, రెవెన్యూ అధికారులను పంపించి అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించడం చాలా దారుణమని రావికమతం మండల జనసేన పార్టీ నాయకులు గంజి శ్రీనివాసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని, ఆరు నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్‌ అద్దెలు, టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని, మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ రద్దు చేయాలని, బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.అడ్డుకుంటున్న ఎంపీటీసీ సూర్యారావు..కోటవురట్ల:మండలంలో అంగన్వాడి కేంద్రాలు తెరవకుండా గ్రామాలలో ప్రతిపక్ష నాయకులు, అంగన్వాడి కార్యకర్తలు నిలువరించారు.పందూరు గ్రామంలో తహసిల్దార్‌ జానకమ్మ సిబ్బందితో రెండు కేంద్రాలను దగ్గర ఉండి తెరిపించారు. మండల కేంద్రంలో ఎంపీటీసీ సూర్యారావు అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు వీలులేదని సిబ్బందిని అడ్డుకున్నారు.ఎయస్‌.రాయవరం:అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుండటంతో ఆ బాధ్యతలను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించినట్లు నక్కపల్లి ఐసిడియస్‌ సూపర్‌ వైజర్‌ యంబి నిషా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కొరుప్రోలు గ్రామంలోని మూడు అంగన్వాడీ సెంటర్లను జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు గ్రామస్థులతో కలిసి తాళాలు బద్దలు కొట్టారు. ఆమె వెంట కార్యదర్శి రామలక్ష్మి, ఇంఛార్జ్‌ మహిళా పోలీసు నాగ సోమేశ్వరి ఉన్నారు.కొత్తకోట:తమ నాణ్యమైన సమస్యల పరిష్కరించా లని కోరుతూ సమ్మె చేస్తుంటే అధికారులతో తాళాలు పగలగొట్టడం దుర్మార్గపు చర్యని టీడీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కోట నీలవేణి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేసారు.మండలంలో పలు గ్రామాలలో సచివాలయం సిబ్బందిఅంగన్వాడీ కేంద్రాల తలుపులు పగలగొట్టారు. కొత్తకోట గ్రామంలో అంగన్వాడీ కేంద్రం -2 సెంటర్లో తాళాలు పగలగొట్టేందుకు వచ్చిన కార్యదర్శి కృష్ణమోహన్‌, ఐసిడియస్‌ సూపర్‌వైజర్‌ విజయ, వి ఆర్‌ఓ లక్ష్మి, సచివాలయం సిబ్బంది తలుపులు పగలగొట్టారు. కొత్తకోట గ్రామంలో అంగన్వాడీ కేంద్రం -2 సెంటర్లో తాళాలు పగలగొట్టేందుకు వచ్చిన కార్యదర్శి కష్ణమోహన్‌, ఐసిడియస్‌ సూపర్‌వైైజర్‌ విజయ, వి ఆర్‌ఓ లక్ష్మి, సచివాలయం సిబ్బందిని, పలువురు గర్భిణీ, బాలింతలు, పిల్లల తల్లులు అడ్డుకున్నారు. 4వ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు కోట సత్తిబాబు, ఉగ్గిన శ్రీను పాల్గొన్నారు.విశాఖ కలెక్టరేట్‌ : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చొని అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. వారి పోరాటానికి జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు పి.వెంకటరెడ్డి, హెచ్‌పిసిఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఐద్వా జిల్లా అధ్యక్షులు బి.పద్మ, ఎల్‌ఐసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ఆచార్యులు ఎస్‌.సూరప్పడు, యుటియుసి నాయకురాలు ప్రమీల, ఎఐడిఎస్‌ఒ జిల్లా అధ్యక్షులు అభిలాష్‌, ఎల్‌ఐసి వర్కింగ్‌ ఉమెన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సూర్యప్రభ, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు కె.మల్లయ్య, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మద్దతు తెలిపారు.తగరపువలస : సమస్యల పరిష్కారానికి ఏడవ రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం తగరపువలసలో భారీర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు), ఎఐటియుసి ఆధ్వర్యాన చిట్టివలస సిఐటియు కార్యాలయం నుంచి ప్రారంభమైన, పట్టణ పురవీధుల మీదుగా తగరపువలస జంక్షన్‌ వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో సిఐటియు భీమిలి జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, రవ్వ నరసింగరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ భీమిలి ప్రాజెక్ట్‌ గౌరవాధ్యక్షులు కె వెంకటలక్ష్మి, నాయకులు శ్రీదేవి, లక్ష్మి, పద్మావతి, ఎఐటియుసి నాయకులు అనురాధ పాల్గొన్నారుపెందుర్తి : అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారంపెందుర్తి కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌ శ్రీనివాసరావు, వైరాంబాబు మద్దతు తెలిపారు. ఏడురోజులుగా అంగన్వాడీలు రోడ్డెక్కి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని సిపిఐ నేతలు హెచ్చ రించారు. అంగన్వాడీయూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బృందావతి, భవానీ, దేవి పాల్గొన్నారు.

➡️