ఘనంగా వెంకన్న తిరువీధి సేవ

హంస వాహనంపై ఊరేగిస్తున్న పురోహితులు

ప్రజాశక్తి-నక్కపల్లి: ఉపమాక వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం హంస వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయంలో అర్చక బృందం ఆధ్వర్యంలో నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని హంస వాహనం, గోదాదేవి అమ్మవారిని పల్లకీలోను అధిష్టింప చేసి గ్రామ తిరువీధి సేవ నిర్వహించారు. ఆస్థాన మండపంలో ద్రావిడ వేద ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, గోపాలచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

➡️