జన్‌ మన్‌ పథకం వర్తింపజేయాలి

మాట్లాడుతున్న గోవిందరావు

ప్రజాశక్తి-రోలుగుంట:నాన్‌ షెడ్యూల్‌(పివిటిజి) ఆదిమ తెగ గిరిజనులకు జన్‌ మన్‌ పథకం వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి గిరిజన సంఘం 5వ షెడ్యూల్‌ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు డిమాండ్‌ చేశారు. సోమవారం రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పిత్రిగడ్డ గ్రామంలో పివిటిజి గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పివిటిజి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ మన్‌ పథకమన్నారు. ఈ కార్యక్రమం కింద కచ్చా ఇళ్లతో నివసిస్తున్న పీవీటీజీ కుటుంబాలకు కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబడుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పథకాన్ని నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతాల్లో వర్తింప చేయాన్నారు. జన్‌ మన్‌ కార్యక్రమం కింద ప్రతి లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి రూ.2.3 లక్షలు మంజూరు చేస్తారన్నారు.షెడ్యూల్‌ ఏరియాలో కలపాలని ఆదివాసులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోక పోవడంతో ఈ పథకం నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలోని పివిటిజిలకు దరిచేరకుండా పోతుందన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని పివిటిజి గిరిజనులకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కొర్ర కొండబాబు పాల్గొన్నారు.

➡️