టిడిపి పాలనలో అభివృద్ధి శూన్యం

వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న వైవి సుబ్బారెడ్డి

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ :నర్సీపట్నంలో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి బయలుదేరిన బస్సు యాత్ర స్థానిక అబీద్‌ సెంటర్‌కు చేరుకొని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ముందుగా వైసిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్‌ మాట్లాడుతూ, 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఏ అభివృద్ధి చేయలేదన్నారు. అయ్యన్నపాత్రుడు శంకుస్థాపనలు చేయడం తప్ప పనులేవీ పూర్తి చేయలేదని విమర్శించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను మన నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీని ఇవ్వడం జరిగిందని కొనియాడారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, ఎమ్మెల్యే గణేష్‌ చొరవవల్లే నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పాలన జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్నార్నారు. మహిళల నేరాలు అదుపు చేసేందుకు దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బూడి ముత్చాల నాయుడు, ఎమ్మెల్యేలు అదీప్‌ రాజు, భాగ్యలక్ష్మి, ధర్మశ్రీ, స్థానిక మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, గోల్కొండ జడ్పిటిసి సుర్ల వెంకటగిరి బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️