పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు

Jan 27,2024 23:54
కోటవురట్ల మండలంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి -కొత్తకోట:ఎప్పుడు ఎన్నికలు జరిగినా సక్రమంగా నిర్వహించేందుకు పోలింగ్‌ బూత్‌లు సిద్ధం చేస్తున్నట్టు రావికమతం తహసీల్దార్‌ మహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం కొత్తకోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ బూత్‌ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ, మండలంలో అన్ని గ్రామాలలోని పోలింగ్‌ బూత్‌లలో సౌకర్యాల కల్పనకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోలింగ్‌ బూత్‌లో విద్యుత్‌, తాగునీరు, ఓటర్లు రాకపోకలకు సాగించేందుకు వీలుగా ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో నిర్మించి శిధిలమైన ర్యాంపులను కూడా మరమ్మతులు చేపడుతున్నట్టు చెప్పారు. ఆయన వెంట కొత్తకోట వీఆర్వో లక్ష్మి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు..పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల పరిశీలనకోటవురట్ల: మండల వ్యాప్తంగా 52 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తహసిల్దార్‌ జానకమ్మ తెలిపారు. మండలంలో గొట్టువాడ, కైలాస పట్నం, పొందూరు, తదితర గ్రామాల్లో వృద్ధులకు వికలాంగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జానకమ్మ, డిప్యూటీ తహసిల్దార్‌ సోమశేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ వుర్ధవరావు పాల్గొన్నారు.

➡️