బాధితుడికి రూ.80వేల ఆర్థిక సహాయం

నగదును అందజేస్తున్న అసోసియేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి -కొత్తకోట:ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన నిరుపేద విద్యా వేత్త పడమటి శ్రీనివాసరావు కుటుంబానికి కొత్తకోటకు చెందిన కొత్తకోట ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సభ్యులు (కెఈఏ) సుమారు రూ.80 వేల ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనువాసరావు గత మూడు నెలల కిందట గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయ పడ్డారు. అతని కుటుంబం నిరు పేద కుటుంబం కావడం తో పాటు తండ్రి వృద్ధుడు, తల్లి అనారోగ్యం తో మృతి చెందటం పలు సమస్యలతో ఉన్నాడు దీనిపై స్పందించిన పలువురు దాతలు ఆర్థికంగా ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ సభ్యులు సుమారు రూ.80 వేల ఆర్థిక చేశారు. ఈ అసోసియేషన్‌ సభ్యుల సూచన మేరకు మరో దాత రూ.40 వేలు, మరొకరు రూ. 16,500 కూడా త్వరలోనే అందించే ఏర్పాటు చేస్తామని సభ్యులు వీరప్రకాష్‌ తెలిపారు. ఈ సందర్బంగా బాదితుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాను కష్టంలో ఉన్నానని గుర్తించి సహాయం అందించిన విద్యార్థులు, యువకులు, స్నేహితులు, మిత్రులకు, పిల్లలు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️