యువగళం సభను విజయవంతం చేయాలి

నక్కపల్లిలో మాట్లాడుతున్న టిడిపి ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న

ప్రజాశక్తి -నక్కపల్లి:విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలేపల్లిలో ఈ నెల 20న జరగనున్న యువగళం ముగింపు ఎన్నికల శంఖారావం సభను విజయవంతం చేయాలని టిడిపి ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌ బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. నక్కపల్లిలో తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆమె స్వగృహంలో ఆదివారం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బుద్ధా వెంకన్న, నియోజకవర్గ పరిశీలకులు బి.చంటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గం లో నాలుగు మండలాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ముగింపు సభకు తరలివెళ్లి సభను జయప్రదం చేయాలని కోరారు. లోకేష్‌ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయ వంతానికి పార్టీ శ్రేణులు ఎంతగానో కృషి చేశారని అనిత పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయడానికి గాను ప్రణాళికలు రూపొందించు కోవడంపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జయప్రదం చేయాలి టిడిపి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుమాడుగుల: యువగళం ముగింపు సభకు పెద్ద ఎత్తున తెలుగుదేశం అభిమానులు, నేతలు తరలి రావాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పిలుపునిచ్చారు. మండలంలో జమ్మదేవిపేట గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాడుగుల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం జనరల్‌ సెక్రెటరీ నారా లోకేష్‌ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభ 20న భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం లో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. ముగింపు సభకి మాడుగుల నియోజకవర్గం నుంచి 5000 మంది తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో చీడికాడ మండల పార్టీ అధ్యక్షులు పోతల చిన్నం నాయుడు, మాజీ సీడీసీ చైర్మన్‌ మజ్జి తాత బాబు, మాజీ బీసీ సెల్‌ అధ్యక్షులు లెక్కల కాసుబాబు, సర్పంచ్‌ సుంకరి సన్యాసి నాయుడు, ఎంపీటీసీ పైల ముత్యాల నాయుడు, మండల యూత్‌ అధ్యక్షులు వడ్డీ రాజకుమార్‌, మాజీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మరువడ ఈశ్వర్రావు, మాజీ సర్పంచ్‌ కోరుకొండ రాజుబాబు, మాజీ ఎంపీటీసీ చక్రవర్తి, బీమేష్‌, నారాయణరావు, కోన చంటి, నానాజీ, కొండలరావు, నారాయణ స్వామి పాల్గొన్నారు.

➡️