రెవెన్యూ సిబ్బందిపై అసహనం

సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ

ప్రజాశక్తి- కోటవురట్లం: రెవెన్యూ అధికారుల పనితీరుపై మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించండి సృష్టించడం చేయవద్దని మాజీ ఎమ్మెల్సీ శుక్రవారం రెవెన్యూ సిబ్బందిపై మండిపడ్డారు. సర్వే నెంబర్‌ 4.31/1 బి లోగల అసైన్డ్‌ భూమి 1988 సంవత్సరం నుండి సాగులోఉన్న భూమిపై రెవెన్యూ అధికారుల ప్రలోభాలకు లోనై వివాదం సృష్టించి రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ విషయమై ఐదు నెలలుగా కార్యాలయం చుట్టూ పెట్ల లక్ష్మి తిరుగు తుందన్నారు. 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై గతంలో నర్సీపట్నం డివిజన్‌ రెవెన్యూ అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించడం, వాటి ఆధారంగా భూయజమానులు సాగులోలేరంటూ తప్పుడు రిపోర్టు ఇవ్వడం పట్ల ఉపతహసిల్దార్‌ సోమశేఖర్‌, గ్రామ రెవెన్యూ అధికారి ఆశారత్నంపై బాధితురాలు సహా పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పందూరు రెవెన్యూ సమస్యపై బాధితురాలు పెట్ల లక్ష్మి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో చేసిన ఫిర్యాదు పట్ల రెవెన్యూ సిబ్బంది తప్పుడు రిపోర్టు పంపడంపై అధికారులను నిలదీశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా చేయవలసి ఉంటుందని ఏ ఆధారాలతో తప్పుడు రిపోర్ట్‌ పంపించారని, తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు తగు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నారాయణరావు, టిడిపి నాయకులు సత్తిబాబు తదితరులు ఉన్నారు.

➡️