రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ పునరుద్ధరణకు ధర్నా

Feb 2,2024 23:08
నినాదాలు చేస్తున్న సిపిఎం నేత అప్పలరాజు, తదితరులు

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:మండలంలో నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్‌లో 2023 డిసెంబర్‌ 24 నుండి రైల్వే రిజర్వేషన్‌లను రైల్వే అధికారులు నిలుపుదల చేయడంపై ప్రయాణికులు స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహింంచారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు శుక్రవారం మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రయాణికులు రిజర్వేషన్‌కు ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న తుని, ఎలమంచిలి రైల్వేస్టేషన్‌కు వెళ్లి చేయించు కోవాల్సి వస్తుందన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. .ఈ ప్రాంత ప్రయాణికులు సౌకర్యార్థం వెంటనే రిజర్వేషన్‌ కౌంటర్‌ పున్ణప్రారంబించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ఎం.సత్యనారాయణ, భాస్కర్‌ పాల్గొన్నారు.

➡️