వాడీవేడిగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

మాటలతో ఘర్షణ పడుతున్న ఇరు పార్టీల సభ్యుల

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:పట్టణంలో మున్సిపల్‌ చైర్‌ పర్శన్‌ బోడపాటి సుబ్బలక్ష్మీ అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. ముందుగా అజెండాను చదివి వినిపించారు. టీడీపీ కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, రోడ్డు విస్తరణ ఎన్ని అడుగులు చేస్తున్నారో తీర్మానం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.అభివృద్ధి పనులను టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారంటూ వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణ ఆధ్వర్యంలో వైసిపి కౌన్సిలర్లు ఎదురు దాడికి దిగారు. జనసేన పార్టీ కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ, నర్సీపట్నం మున్సిపాలిటీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పెదబొడ్డేపల్లి వరకు రోడ్డు విస్తరణపై ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 అడుగులకు విస్తరించాల్సి ఉండగా 30 అడుగులకు ఎందుకు కుదించారని ప్రశ్నించారు.రోడ్డు విస్తరణ కుదించడం వల్ల ప్రజలు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️