సచివాలయాల వద్ద ఆందోళనలు

నర్సీపట్నంలో సుబ్బారెడ్డి వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. సచివాలయాల వద్ద అంగన్‌వాడీలు ఆందోళనలు చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. నక్కపల్లి: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడి వర్కర్స్‌ చేపట్టిన సమ్మె శనివారం నాటికి 19వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా శనివారం మండలంలో పలు సచివాలయాల వద్ద అంగన్వాడి వర్కర్స్‌ పంచాయతీ కార్యదర్శులకు తమకు సహకరించాలని కోరుతూ విజ్ఞప్తి పత్రాలను అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని తదితర సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు.ఉపమాకలో జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ మాజీ సభ్యులు కొప్పిశెట్టి కొండబాబు, సర్పంచ్‌ ప్రగడ వీరబాబు, టిడిపి శ్రేణులు కొప్పిశెట్టి బుజ్జి, సూర్యనారాయణ, శ్రీను, వాసు, దొరబాబు, వెంకటేశ్వరరావు తదితరులు సంఘీభావం తెలిపారు. న్యాయం పూడిలో జనసేన నేత ఆకేటి గోవిందరావు సంఘీభావం ప్రకటించారు.చీడికాడ :మండల కేంద్రంలో చావిడి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌ శంకర్రావు, డివిజన్‌ కార్యదర్శి కార్యదర్శి ఆర్‌.దేముడు నాయుడు మాట్లాడుతూ, ఐసిడిఎస్‌ను పటిష్ట పర్చాలని, నాణ్యమైన సరుకులు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్ట నాయకులు ఎం.జానకి. రామలక్ష్మి. రాజులమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.సుబ్బారెడ్డికి వినతినర్సీపట్నం టౌన్‌్‌:సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ఉత్తరాంధ్ర వైసిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డికి వినతిపత్రం అందజేశారు. శనివారం సాధికార బస్సు యాత్ర నేపధ్యంలో ఆయన నర్సీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఆయన్ను కలిసి సమస్యలను వివరించారు. కోటవురట్ల:మండలంలో పలు సచివాలయాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసనలు చేపట్టి సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యవర్గ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆగదన్నారు. యస్‌ రాయవరం:మండలంలోని పి.ధర్మవరంలో గ్రామ సచివాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేపట్టారు. గ్రామ కార్యదర్శి వెంకట రమణ, విఆర్‌ఓ సూరిబాబు లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, గ్రామ ఉపసర్పంచ్‌ కలిగట్ల మాణిక్యం, అంగన్వాడీ టీచర్లు వి.లక్ష్మి, జోగలక్ష్మి, పాల్గొన్నారు.వడ్డాది: పస్తులతో రోడ్లపై ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీల సమస్యలు సిఎం జగన్‌కు కనబడలేదని ఉత్తరాంద్ర చర్చ వేదిక కన్వీనర్‌ అడపా నరసింహమూర్తి ప్రశ్నించారు. బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది సచివాలయం వద్ద అంగన్‌వాడీలు సమ్మె చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి లోవరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రేమ్‌చంద్రశేఖర, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సాంబశివరాలు, యూనియన్‌ నేతలు అమ్మాజి, వరలక్ష్మి పాల్గొన్నారు.మాడుగుల: మాడుగులలో మూడు సచివాలయ సెక్రెటరీ అధికారులకు వినతి పత్రాలు అందజేసి ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి మాడుగుల ప్రాజెక్టు యూనియన్‌ నాయకులు ఆర్‌.రామలక్ష్మి, డి.పార్వతి, వి ధనలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్రావు, దేముడు నాయుడు, ఆదివాసి గిరిజన సంఘం నాన్‌ షెడ్యూల్‌ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి పాల్గొని మద్దతు తెలిపారు.మునగపాక:మండల కేంద్రం మునగపాక సచివాలయాల వద్ద అంగన్వాడీలు శనివారం ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ ఎస్‌ బ్రహ్మాజీ, యూనియన్‌ నాయకులు హేమలత, సరస్వతి, శివగణేష్‌ అమ్మ పాల్గొన్నారు. మండలంలోని వెంకటాపురం సచివాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీలు పాల్గొన్నారు.కశింకోట : కసింకోట గ్రామ సచివాలయాలు (ఒకటి, రెండు, మూడు, నాలుగు) ఎదుట అంగన్వాడీలు శనివారం ధర్నా చేశారు. అనంతరం సచివాలయ అధికారి కిషోర్‌, ఈఓర్డ్‌ రమేష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తనుజ, శ్యామల, సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. మండలంలోని సుందరయ్య పేట, భీమవరంలో వినతిపత్రాలు అందజేశారు.చోడవరం : అంగన్వాడి కార్యకర్తలు రిలే దీక్షలో భాగంగా చోడవరం సచివాలయ పంచాయతీ ఈవో నారాయణరావుకు వినతిపత్రం అందించారు. సిఐటియు నేత నాయుడు పాల్గొన్నారు.పరవాడ : మండలంలోని వాడు చీపురుపల్లి, పరవాడ, ఈ బోనంగి, కలపాక, లంకెలపాలెం, పెద్దముషిడివాడ, మంత్రి పాలెం, మర్రిపాలెం, ఫార్మాసిటీ కాలనీ, తానాం, భరణం, దేశపాత్రునిపాలెం సచివాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. యూనియన్‌ నాయకురాలు అమ్మాజీ, సిహెచ్‌ దేవి, పార్వతి పాల్గొన్నారు.రాంబిల్లి : మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల వద్ద 19వ రోజు అంగన్వాడీలు సమ్మెలో భాగంగా ఆందోళన చేసి సచివాలయ సిబ్బందికి వినతి పత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, జి దేవుడు నాయుడు, యూనియన్‌ నాయకులు సుజాత, లక్ష్మీ, శేషారత్నం, కుమారి పాల్గొన్నారు.అనకాపల్లి : అనకాపల్లి అర్బన్‌ సచివాలయాలు, మండలంలోని వివిధ సచివాలయాల్లో అంగన్వాడీలు శనివారం వినతిపత్రాలు అందజేశారు. యూనియన్‌ నాయకులు ఉమా నారాయణమ్మ, కృష్ణవేణి పాల్గొన్నారు.కె.కోటపాడు : అంగన్వాడీలు శనివారం మండలంలోని పలు సచివాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. వీరి ఆందోళనకు కో-ఆపరేటివ్‌ యూనియన్‌ కార్యదర్శి ఈశ్వరరావు మద్దతును తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గండి నాయన బాబు, ఎర్ర దేవుడు, డోకల కుమారి, పి భవాని పాల్గొన్నారు.సబ్బవరం : సబ్బవరం సచివాలయంతో పాటు పలు సచివాలయాల వద్ద అంగన్వాడీలు నిరసనలు తెలిపి, వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, యూనియన్‌ నాయకులు వి.వి.రమణమ్మ, ఎం. వరలక్ష్మి, పుష్ప పాల్గొన్నారు.దేవరాపల్లి : దేవరాపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి, సచివాలయం-1 దగ్గర అందోళన చేసి, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.వెంకన్న, యునియన్‌ నాయకులు జి.వరలక్ష్మి, పద్మ కోమలి పాల్గొన్నారు.బుచ్చయ్యపేట : అంగన్వాడి కార్యకర్తలు శనివారం మండలంలోని బుచ్చయ్యపేట, రాజాం, వడ్డాది తదితర గ్రామపంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆది వరలక్ష్మి అమ్మాజీ, వెంకటలక్ష్మి చిలుకమ్మ, జగదాంబ పాల్గొన్నారు.అచ్యుతాపురం : అంగన్వాడీలు శనివారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి, ఎంపీడీవో విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము, మండల కన్వీనర్‌ కే సోము నాయుడు, యూనియన్‌ నాయకులు బి జయ, వరలక్ష్మి, నారాయణమ్మ పాల్గొన్నారు. కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలు సమ్మెలో భాగంగా 19వ రోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు. అంగన్‌వాడీలకు కేవలం రూ. 1000 వేతనం పెంచి, రూ.4,500 పెంచామని అబద్ధాలు చెప్పడం మానాలన్నారు. యూనియన్‌ నాయకులు పి.శ్యామలాదేవి, చెల్లయమ్మ, ఐఎఫ్‌టియు నాయకులు పి.రామలక్ష్మి పాల్గొన్నారు.పెందుర్తి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మెకు ఐద్వా నేత అనంతలక్ష్మి సంఘీభావం తెలిపారు. 19 రోజులుగా అంగన్వాడీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే, సిఎం జగన్‌ కనీసం కనికరం చూపకపోవడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీల రాష్ట్ర యూనియన్‌ ఉపాధ్యక్షురాలు కె.బృందావతి, భవాని దేవి పాల్గొన్నారుపద్మనాభం: నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీలకు సిఐటియు, ఎఐటియుసి నేతలు సంఘీభావం తెలిపారు.

➡️