5న ధర్నాను జయప్రదం చేయండి

మాట్లాడుతున్న ప్రసన్న

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:విజయవాడలోఈ నెల 5న జరిగే దర్నాని జయప్రదం చేయాలని ఏపి మిడ్డేమిల్‌ పథకం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.ప్రసన్న పిలుపునిచ్చారు. సోమవారం నర్సీపట్నం సిఐటియు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కార్మికులకు వేతనాలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న బకాయి బిల్లులు వేతనాలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతీ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్‌, యూనిఫారంను అందించాలన్నారు. హైస్కూల్లో వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని, స్కూల్‌ విలీనం పేరుతో తొలగించిన కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని తదితర డిమాండ్ల సాధనకై ధర్నాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మీడ్డేమీల్‌ పథకం కార్మిక సంఘం నాయకులు చిన్నతల్లి, సత్యవతి, నూకరాజు, జగది తదితర్ల పాల్గొన్నారు.

➡️