చేతులో బెల్లం రాసి ముక్కుపుల్ల లాగేస్తున్నారు

Dec 30,2023 10:39 #anakapalle district
cpm comments on boodi mutyala naidu

 

ప్రజాశక్తి-దేవరాపల్లి : నాన్ షేడ్యూల్డ్ గిరిజనులకు మంత్రి బూడిముత్యాలు నాయుడు చేతులో బెల్లం రాసి ముక్కులోని ముక్కుపుల్ల లాక్కునట్లు ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. శనివారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఐదవ షేడ్యూల్డ్ లో చేర్చె ప్రతిపాదనలను మంత్రి చేప్పారంటు ఉన్నతాధికారులు నిలుపుదల చేయడం, చారిత్రాత్మిక తప్పదమని అయిన పేర్కోన్నారు. నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామలను ఐదవ షేడ్యూల్డ్ లో చేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన గిరిజన గ్రామాల జాబితాలను సంవత్సరంన్నర క్రితమే ప్రతిపాదనలు అడగడం జరిందని తెలిపారు. దీనిపై తహశీల్దార్లు గిరిజన గ్రామాలు యెక్క జాబితాలు తయారు చేసి పాడేరు పిఓకు జిల్లా కలెక్టర్లు అప్పట్లోనే సమర్పించారని దీనిపై మంత్రి బూడి ముత్యాలు నాయుడుతో పాటు చోడవరం నర్సీపట్నం ఎమ్మెల్యేలు అబిప్రాయాలు కోరగా ఇప్పటికే నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలన్ని, అన్ని విధాలుగా అభివృద్ధి చేంది ఉన్నాయని ఇప్పుడు ఐదవ షేడ్యూల్డ్ లో చేర్చడం వలన కొత్తగా గిరిజనులుకు ఓరిగింది ఏమిలెదంటు పైగా భూస్వాములు నుండి మాకు సమస్యలు వస్తాయని చెప్పి ప్రతిపాదనలు జాబితాలను పంపించ వద్దు అంటు అడ్డుపడ్డారని తెలిపారు. నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను రాజ్యంగంలో ఐదవషేడ్యూల్డ్ లో చేర్చకుండ అడ్డుపడే అదికారం మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవరు ఇచ్ఛారని ప్రశ్నించారు? స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్న నాన్ షేడ్యూల్డ్. ఏరియా గిరిజనులు అన్ని హక్కులు కోల్పోయారని తెలిపారు. పేరుకు గిరిజనులుగా బ్రతుకుతున్న ఉద్యోగాల్లోను ఉపాధి అవకాశాల్లోను భూ బదాలాయింపు లాంటి 1/70 చట్టాన్ని నష్ట పోయారని తెలిపారు కోన్ని నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాల్లో అక్క అక్కడ రోడ్లు సౌకర్యాలు కల్పించినట్లు చూపించిన గిరిజనులకు శాస్విత పరిష్కారానికి దూరంచేసారని తెలిపారు. నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో ఉన్నత చదువులు చదువకున్న యువతి యువకులు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు.
అనంతగిరి మండలంలోని నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను మాత్రమే ఐదవషేడూల్డ్ లో చేర్చడంకోసం అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని అనకాపల్లి జిల్లాలోని మిగిలిన,తోమ్మిది మండలాల్లో గిరిజనులుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తెలిపారు,జిల్లాలు పునర విభజణ తరువాత అప్పటి వరకు ఉన్న పాడేరు ఐటిడిఎ కూడ లెకుండా పోయిందని ఇప్పుడు నాన్ షేడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనులు వారి సమస్యలు ఎవరి చేప్పుకోవాలో తెలియని పరిస్థితి ఎర్పడిందన్నారు ఇది అత్యంత దుర్మార్గయిందని తెలిపారు,ఒక ప్రక్కన నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఐదవషేడ్యూల్ చేర్పిస్తామని ప్రకటన చేసి రెండు సంవత్సరాలు క్రితం గిరిజన సలహా మండలి తీర్మానం చేసిందని ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డు పడి గిరిజనులు గోంతు కోసారని తెలిపారు, జిల్లాలోని,నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలన్నింటినీ ఐదవషేడ్యూల్ లో చేర్చాలని ఏళ్ల తరబడి గిరిజనులు ఆందోళన చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల తోలగింపుకు పూనుకుంటు హైడ్రో పవర్ ప్లాంట్ లాంటి ప్రమాదకరమైన కంపినిలకు అనుమతులు ఇస్తు కుట్రలు చేస్తుందని తెలిపారు భవిష్యత్తులో గిరిజనులు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అవేదన వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లాలో తోమ్మిది మండలాల్లో 113 రెవెన్యూ గ్రామాలు 262 గిరిజన గ్రామాలు 95 వేలమంది జనాభా గల ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని వీరీ బ్రతుకులు ప్రశ్నర్దకంగా మారుతున్నాయని తెలిపారు దేవరాపల్లి చీడికాడ వి మాడుగుల రావికమతం,రోలుగుంట గొలుగొండ, నాతవరం,కోటవురట్ల, మండలాల్లో 113 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయని తెలిపారు గిరిజన సలహా మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికి అమలు చేయలేక పోయిందని తెలిపారు.
ఇప్పటికే గిరిజనుల చేతిలో ఉన్న భూములన్నీ గిరిజ నేతరుల పరం అయ్యాయని కొద్ది గొప్పో ఉన్న ప్రభుత్వ భూములు కూడా పట్టాలు ఇవ్వడం లెదన్నారు రాష్ట్రప్రభుత్వం నాన్ షేడ్యూల్డ్ గ్రామాల్లో కూడా అభివృద్ధి పేరుమీద గిరిజన భూములను కాజేస్తుందని గిరిజనులు భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు మంత్రులు ఎమ్మెల్యేలు అనకాపల్లి జిల్లాలోని నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఐదవషేడ్యూల్డ్ లో చేర్చకుండా అడ్డుపడి గిరిజనులు సంపదను దోసుకుంటు గిరిజనులు చేతుల్లో బెల్లం రాసి ముక్కులోని ముక్కుపుల్ల లాక్కున్నట్లు ఉందని తెలిపారు, వెంటనే నాన్ షేడ్యూల్డ్ ఏరియా గిరిజనులకు ఐఎఎస్ అధికారితో కూడుకున్న ప్రత్యేక ఐటిడిఎ ఎర్పాటు చేయాలని లెదంటే గిరిజన ద్రోహులుగా చరిత్ర హీనులుగా మిగిలి పోతారని వెంకన్న స్పష్టం చేశారు.

➡️