2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Dec 31,2023 12:56 #anakapalle district
cpm loknadh wishes

ప్రజలకు కష్టాలు లేని రోజులు రావాలి
– సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ప్రజాశక్తి-అనకాపల్లి :  ప్రజలకు ద్రోహం చేసే ప్రభుత్వాల స్థానంలో ప్రజలకు మేలుచేసే నూతన ప్రభుత్వాల ఏర్పాటుకు ఈ ఏడాది పునాదులుపడాలి. అన్యాయం, అసమానతలు, మోసాలకు వ్యతిరేకంగా జరిగే సంఘటిత ప్రజాపోరాటాలు విస్తృతం కావాలి. వివిధ తరగతులు తమ సమస్యలపై నిర్వహించే ఉద్యమాలతో ప్రభుత్వాలకు ముకుతాడువేయాలి. ప్రజలకు సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వైద్యం, ఆహారం, త్రాగునీరు, సాగునీరు, రహదారుల సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

➡️