నేషనల్ ఖేలో ఇండియా పోటీలకు గండి జ్యోతి

Mar 23,2024 13:30 #anakapalle district

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : ఈనెల 26 నుండి 29 వరకు జమ్ము కాశ్మీర్ లో జరుగనున్న సబ్ జూనియర్ నేషనల్ వూషూ పోటీలకు మన ఆంధ్ర ప్రదేశ్ టీం తరపున నర్సీపట్నం నుండి గండి జ్యోతి 48కేజీల విభాగం గర్ల్స్ కేటగిరిలో ఆడుతున్నారు. ఈమె గత సెప్టెంబర్ లో శ్రీకాకుళం స్టేట్ వూషూ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి ఈ టోర్నమెంట్ కి అర్హత సాధించారని కోచ్ యర్రా శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నింజాస్ అకాడమీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సుతాపల్లి శ్రావణ్, సుతాపల్లి శ్రీకాంత్ నేషనల్ లో మెడల్ సాధించాలని ఆకాంక్షించారు. ఎన్ఐఎస్ వూషూ కోచ్ ప్రియాంకను అభినందించారు. జ్యోతి అనేక విజయాలు సాధించాలని తోటి బాక్సర్లు తల్లిదండ్రులు మెంబెర్స్ కోరుతున్నారు.

➡️