ప్రమాదానికి గురైన వారిని ఆదుకోవాలి

Mar 15,2024 16:23 #anakapalli

ప్రజాశక్తి-రాంబిల్లి(అనకాపల్లి) : అచ్చుతాపురం ఈ జెడ్ పరిధిలో సెం బయో జనరిక్స్ ఫార్మా కంపెనీలో బుధవారం ఉదయం ఏ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు బాయిలర్ వద్ద ప్రమాదం జరిగి ముగ్గురుకు తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసినదే ఈ ప్రమాదం జరిగిన వెంటనే సెం బయో కంపెనీ యాజమాన్యం ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా గాయాల పాలైన కార్మికులను గోప్యంగా విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమైఈరోజు సింబయో ఫార్మా కంపెనీ ముందుసిఐటియు ఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రంగళి రాము, జి దేవుడు నాయుడు మాట్లాడుతూ సెం బయో జెనరిక్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదానికి గురైన ఏ రాము, ఏ సన్యాసిరావు, కె నర్సింగ్ రావు నాకు మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, లేబర్ అధికారులు, పర్యవేక్షణ చాలా లోపబోయిష్టంగా ఉందని, ప్రమాదాలు జరిగిన కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. భద్రతా ప్రమాణాలు పాటించని ఫార్మ కంపెనీలపై ప్రభుత్వం, జిల్లా అధికారి యంత్రాంగంసమగ్ర విచారణ జరిపికఠిన చర్యలు చేపట్టాలని, ప్రమాదంలో 85% వరకు కాలిపోయిన ఏ రాము, కే నర్సింగరావు లకు మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని లేకుంటే బాధిత కుటుంబాలతో పెద్ద ఎత్తున కంపెనీ వద్ద ఆందోళన చేపడుతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోచందక రామకృష్ణ, వై రాము, నాయుడు, నర్సింగరావు, ఆర్ రాంబాబు చింతకాయల శివాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️