జార్జ్ క్లబ్లో యోగ ద్వితీయ వార్షికోత్సవం

May 24,2024 12:53 #anakapalle district

ప్రజాశక్తి-అనకాపల్లి : భారత స్వాభిమాన ట్రస్ట్, పతాంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షుడు భీశెట్టి దొరమ్మ నాయుడు సారధ్యంలో రెండు సంవత్సరాలుగా ఎందరికో ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ జిల్లా వ్యాప్తంగా పలు సెంటర్లు ఏర్పాటు చేసేందుకు గాను అందరిచే యోగా చేద్దాం రోగాలు లేకుండా జీవిద్దాం అనే సంకల్పంతో ఇప్పటికె 80 మంది సహా ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఉన్నారు. జిల్లాలో పలు సెంటర్ల ద్వారా యోగాని అందరికీ దగ్గర చేసేందుకు అనకాపల్లి జార్జి క్లబ్ లో నిరంతర యోగ శిక్షణ తరగతులు ప్రతిరోజు జరుగుతున్నాయి. ద్వితీయ సంవత్సర వేడుకల్లో భాగంగా యోగా గురువు నాయుడు మాట్లాడుతూ మూడు రోజులు కార్యక్రమాల్లో భాగంగా 24న జల యోగ కార్యక్రమం శారదా నగర్ లో గల ఈశ్వర్ స్విమ్మింగ్ పూల్ నందు శ్వాసపై ధ్యాస పెంపొందించేందుకు జలాశనాలు నిర్వహించడం జరిగిందన్నారు. 25 న యోగ పై నగర సంచరణ యోగాతో శరీరము ఆయుధం అయితే ఆరోగ్యం జీవితకాలం బానిస అవుతుందని, దీనిపై పట్టణ ప్రధాన కూడలినందు ఆరోగ్యం పెంపొందించుకునే విధంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. 26న పూజ్య స్వామి రిత్ దేవ్ మహారాజ్ జి, పతంజలి యోగపీట్ హరిద్వార, జొన్నలగడ్డ శ్రీనివాసులు ఏపీ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖులు విచ్చేస్తున్నారన్నారు. వార్షికోత్సవ కార్యక్రమంసాయంత్రం 5.00 గం.లకు గాయత్రీ, మృత్యంజయ హోమం మహిళలచే యోగాసనాల ప్రదర్శన & యోగా విషిష్టత గూర్చి వివరించి పలు అనారోగ్య సమస్యలకు ఏ ఆసనాలు బాగా అనుకూల మంచి ఫలితాలను ఇస్తాయో వాటిపై వివరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాజిగ్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి బి ఎస్ ఎం కె జోగి నాయడు, బుద్ధ కాశీ విశ్వనాథ్, వి చంద్రశేఖ తదితరులు పాల్గొన్నారు.

➡️