ఏపీ కీడు తొలగాలి… వెలుగు నింపాలి

Jan 14,2024 13:43 #anakapalle district
tdp protest against land titling act akp

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : ఏపీ కీడు తొలగాలి… వెలుగు నింపాలి అంటూ తెదేపా ఇంచార్జ్ బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో మండలంలో బంగారు మెట్ట జంక్షన్లో భోగి మంటలు వేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టినశని లా దావూరించాడని, మద్యం ఇసుక, ల్యాండ్ తదితరు అన్ని రంగాల్లోనూ జగన్ దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శించారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం అడ్డగోలుగా విడుదల చేసిన జీవో కాపీలను భోగిమంటలో వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోకవాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, సాయం శేషు, దొండ రమేష్ దొండ నరేష్,సింగంపల్లి రమేష్,ఏ కనకరాజు, గొన్నాబత్తుల శ్రీనివాసరావు, సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️