అర్జీలకు సత్వర పరిష్కారం : కలెక్టర్‌

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

అనంతపురం కలెక్టరేట్‌ : స్పందనలో వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఒ గాయత్రి దేవి, ఆర్డీవో గ్రంధి వెంకటేష్‌, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి 335 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ అర్జీలను సత్పరమే నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆయా శాఖల అధికారులు దీనిపై ప్రత్యేక దష్టి సారించి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. పెండింగ్‌ ఉన్న అర్జీలను గడువులోపు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️