ఓటు హక్కుపై అవగాహన

ఓటు హక్కుపై అవగాహన

విద్యార్థినుతో ప్రతిజ్ఞ చేయిస్తున్న జెవివి రాష్ట్ర కార్యదర్శి నాదల్‌

ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌

ప్రజాస్వామ్యం మనుగడకు అసలైన ఆయుధం ఓటు అని జన విజ్ఞాన వేదిక(జెవివి) రాష్ట్ర కార్యదర్శి నాదల్‌ పేర్కొన్నారు. స్థానిక కెటిఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జెవివి ఆధ్వర్యంలో ఓటు హక్కు, ఓటు నమోదు చేసుకునే విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు. యువత ఓటు హక్కును సద్వి నియోగం చేసుకోవడంతో పాటు తోటి వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత ఉందన్నారు. మతం, జాతి, కులం, వర్గం, భాష, తారతమ్యాలు లేకుండా ఒత్తిళ్లు, బంధుప్రీతి, ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల విద్యార్థినుల తో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

➡️