కిడ్నీ బాధిత మహిళా కానిస్టేబుల్‌కు ఆర్థికసాయం

కిడ్నీ బాధిత మహిళా కానిస్టేబుల్‌కు ఆర్థికసాయం

కానిస్టేబుల్‌కు ఆర్థికసాయం అందజేస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

 

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

కిడ్నీ బాధిత మహిళా కానిస్టేబుల్‌కు ఆర్థికసాయం అందించి జిల్లా పోలీస్‌ శాఖ మానవత్వం చాటుకుంది. అనంతపురం ఎస్సీ, ఎస్టీ సెల్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ కుళ్లాయమ్మకు కిడ్నీకి సంబంధించిన వ్యాధి సోకింది. దీంతో కిడ్నీ మార్పిడికి ఇబ్బంది పడుతుండగా గమణించిన పోలీస్‌ శాఖ కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఎస్పీ వరకూ ఆర్థికసాయం అందించారు. ఇలా సేకరించిన రూ.7.20 లక్షల చెకు, రూ.50 వేల నగదును బాధిత కుటుంబానికి ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ అందజేశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, డిసిఆర్‌బి సిఐ విశ్వనాథచౌదరి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్‌, సుధాకర్‌రెడ్డి, గాండ్ల హరినాథ్‌, తేజ్‌పాల్‌, శ్రీనివాసులునాయుడు, సరోజ, తదితరులు పాల్గొన్నారు.

➡️