చెవిలో పూలు పెట్టుకుని పంచాయతీ కార్మికుల నిరసన

చెవిలో పూలు పెట్టుకుని పంచాయతీ కార్మికుల నిరసన

చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలుపుతున్న పంచాయతీ కార్మికులు

బుక్కరాయసముద్రం : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో చేపట్టిన సమ్మెలో భాగంగా పంచాయతీ కార్మికులు చెవిలో పూలు పెట్టుకుని మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మండేలా రామాంజనేయులు, గోపాల్‌, శివప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ట నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే పంచాయతీ అధికారులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని, పనిముట్లు అందజేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీఎఫ్‌ ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నాగేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం పుల్లయ్య, ఎర్రన్న, అంకాలు, పంచాయతీ వర్కర్లు ఎర్రినాగయ్య, నాగరాజు, సి నాగేంద్ర, విజరు, ఎర్ర కొండప్ప, నగేష్‌, లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, పవిత్ర పాల్గొన్నారు.

➡️