తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి-కుందుర్పి

తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పలువురు మహిళలు శనివారం మండల కేంద్రంలోని రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 20 రోజులుగా మండల కేంద్రంలోని మంగళ వీధి, బోయ వీధి, కురాకుల వీధి తదితర వీధుల్లో తాగునీటి సమస్య నెలకొందన్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్నారు. చేసేది లేక ధర్నాకు దిగినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, పంచాయతీ అధికారులు మహిళల వద్దకు వచ్చి చర్చించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.

➡️