దుస్తుల దుకాణం సీజ్‌ దుర్మార్గం : సిపిఎం

దుస్తుల దుకాణం సీజ్‌ దుర్మార్గం : సిపిఎం

విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-గుంతకల్లు

పట్టణంలోని కింద పెట్రోల్‌ బంకు పక్కన ఉన్న ఇండియన్‌ స్టోర్‌ దుస్తుల దుకాణాన్ని మున్సిపల్‌ అధికారులు శనివారం ఉన్నఫళంగా సీజ్‌ చేయడం దుర్మార్గమని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్‌ స్టోర్‌ దుస్తుల దుకాణాన్ని ఆరు నెలల క్రితం ప్రారంభించారన్నారు. అంతకుముందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని రూ.లక్షలు వెచ్చించి షెడ్‌ నిర్మించుకున్నా రన్నా రు. వ్యాపారం ప్రారంభించి ప్రజలందరికీ తక్కువ ధరలో మంచి నాణ్యమైన దుస్తులను అందుబాటులో ఉంచారన్నారు. అయితే మున్సిపల్‌ అధికారులకు ఆరునెలలుగా కనబడలేని పర్మిషన్‌ హడావుడిగా శనివారం వచ్చి అనుమతులు లేవని సీజ్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. పట్టణంలో కొన్ని షాపులకు పర్మిషన్‌ లేకుండానే నడుపుతున్నారని, మరి వాటి మీద లేని చర్యలు ఇండియన్‌ స్టోర్‌ షాప్‌ చేయడం సిగ్గుచేటన్నారు. ఇండియన్‌ స్టోర్‌ దుకాణ యజమానులు తగ్గువ ధరకు దుస్తులు అముతుండటంతో ఓర్వలేక పట్టణంలోని దుస్తుల షాపుల యాజమాన్యం వారు కొంతమంది పోగై వారించారన్నారు. తమిళనాడు నుంచి వచ్చి వ్యాపారం చేయకూడదని బెదిరించడం బాధాకరమన్నారు. స్థానిక వ్యాపారులు చొరవతో దుకాణం సీజ్‌ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. సీజ్‌ చేసిన ఇండియన్‌ స్టోర్‌షాపును తక్షణమే ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు మారుతీప్రసాద్‌, జగ్గలి రమేష్‌, కసాపురం రమేష్‌, సాకే నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️