నిరవధిక సమ్మె విజయవంతానికి బైక్‌ ర్యాలీ

నిరవధిక సమ్మె విజయవంతానికి బైక్‌ ర్యాలీ

బైకు ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌

మున్సిపల్‌ కార్మిక సమస్యల పరిష్కారానికి ఈనెల 26వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు ప్రజలు మద్దతు కోరుతూ మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్‌, తిలక్‌ రోడ్డు, గాంధీ బజార్‌, బసవన్నకట్ట, అంబేద్కర్‌ నగర్‌, కలెక్టరేట్‌ మీదుగా సాగింది. ఈ ర్యాలీని సిఐటియు నగర కార్యదర్శి వెంకట్‌నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ముర్తుజ, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, బకాయి డీఏలు ఇవ్వాలని, సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేయాలని సమ్మెబాట పట్టనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు, సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు సాకే తిరుమలేశు, బండారి స్వామి, సిఐటియు నగర కోశాధికారి ప్రకాష్‌, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంజీవరాయుడు, మల్లికార్జున, ఇంజనీరింగ్‌ విభాగం నగర కార్యదర్శులు కోశాధికారి ఓబుళపతి, పోతులయ్య, మహిళా నాయకురాళ్లు లక్ష్మీనరసమ్మ, వరలక్ష్మి, కాంతమ్మ, లక్ష్మీదేవి, కుమారి, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఎం.నల్లప్ప, రెగ్యులర్‌ నాయకులు ఎల్‌.ముత్తు, ఆదినారాయణ, శ్రీనివాసులు, కిరణ్‌కుమార్‌, రాజు, వెంకటేష్‌, ప్రభాకర్‌, లక్ష్మయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️