ప్రభుత్వ ఆసుపత్రి స్థలం టూరిజం శాఖకు ఇవ్వొద్దు

ప్రభుత్వ ఆసుపత్రి స్థలం టూరిజం శాఖకు ఇవ్వొద్దు

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైదుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ రామస్వామి నాయక్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ సర్వజనాసుపత్రి ట్రస్టుకి సంబంధించిన సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్సర్‌ ఆసుపత్రి భూముల్లో ఎకరా భూమిని టూరిజం శాఖకు ఇవ్వడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైదుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ రామస్వామి నాయక్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ వైఎంఎస్‌.ప్రసాద్‌, కోశాధికారి డాక్టర్‌ జి.హేమలత అన్నారు. ఈమేరకు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆసుపత్రికి చెందిన భూమిని టూరిజం శాఖకు ఇస్తున్నట్లు వచ్చిన జిఓను రద్దు చేయాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే అనంత సానకూలంగా మాట్లాడారు. ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని వేరొక శాఖకు అప్పగించడం జరగదని హామీ ఇచ్చారు.

➡️