ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి : డీఎస్పీ గంగయ్య

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి : డీఎస్పీ గంగయ్య

చిత్రచేడులో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ గంగయ్య

ప్రజాశక్తి-పెద్దవడుగూరు

రాబోయే సార్వత్రిక ఎన్నికలు గ్రామాల్లో ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని తాడిపత్రి డీఎస్పీ గంగయ్య సూచించారు. మండలంలోని సమస్యాత్మక గ్రామం చిన్నవడుగూరులో మంగళవారం పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరూ ఎలాంటి పంతాలు, పట్టింపులకు వెళ్లక మీకు నచ్చిన వారికే ఓటువేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఎవరూ గొడవలకు వెళ్లవద్దని ప్రశాంత జీవనం కొనసాగించి ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఇప్పటికే అన్ని సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఉంచామని అసాంఘిక శక్తులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు వారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అనంతరం ఆయన చిన్నవడుగూరు, దిమ్మగుడి, చిత్రచేడు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై క్షున్నంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డీఎస్సీ హేమంత్‌కుమార్‌, సీఐ రోషన్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

➡️