మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం : కలెక్టర్‌

మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం : కలెక్టర్‌

అర్జీదారుని సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

బొమ్మనహాల్‌ : మండల స్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగన్నకు చెబుదాం స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని మండలాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. బొమ్మనహాల్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మితతో కలిసి 70 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయిలో వచ్చిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్య ప్రజల జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మండల స్థాయిలో ఏర్పాటు చేసి జిల్లా స్థాయి అధికారులు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా ఆయాశాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, డిఎస్‌ఒ శోభారాణి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నాగరాజ్‌, డిఎంహెచ్‌ఒ డా||ఈబి.దేవితో పాటు వివిధ శాఖల జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు. జిందాల్‌ సా ఫ్యాక్టరీ పరిశీలనబొమ్మనహాల్‌ మండలంలోని హరేసముద్రం గ్రామం వద్దనున్న జిందాల్‌ సా లిమిటెడ్‌ ఫ్యాక్టరీని కలెక్టర్‌ ఎం.గౌతమి పరిశీలించారు. ఫ్యాక్టరీలోని పవర్‌ ప్లాంట్‌, బ్లాస్ట్‌ పర్మస్‌, డిటి ప్లాంట్‌, తదితర విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్‌ శ్రీనివాసులు, జిందాల్‌ సా లిమిటెడ్‌ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్‌, యూనిట్‌ హెడ్‌ సౌమ్య జ్యోతిసర్మస్‌, డిఐహెడ్‌ సుబ్రమణ్యం, హెచ్‌ఆర్‌ లు రాజ్‌ కుమార్‌ మెహతా, శుభాని పాల్గొన్నారు.

➡️