మత్స్యకారులను ఆదుకుంటాం : విప్‌ కాపు

కార్యక్రమంలో మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి

 

ప్రజాశక్తి-రాయదుర్గం

మత్స్యకారులకు జీవనోపాదులు కల్పించి ఆదుకుంటున్నామని విప్‌ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం గుమ్మగట్ట మండలంలోని భైరవానితిప్ప జలాశయంలోకి 6.44 లక్షల చేప పిల్లలను విప్‌ వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా రిజర్వాయర్‌లోకి సమృద్ధిగా నీరు వస్తోందన్నారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రతిఏటా చేప పిల్లలను వదులుతున్నట్లు వివరించారు. మత్స్యకారుల జీవన ఉపాధి కల్పనకు సిఎం జగన్‌ సైతం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. కాగా కణేకల్‌ పరిధిలో ఉన్న హెచ్‌ఎల్‌సి కెనాల్‌ కింద రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అదనంగా మరో టీఎంసీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడుతామని హామీ ఇచ్చారన్నారు. కణేకల్లు చెరువులో పూడికతీత పేరుతో టిడిపి నాయకులు గతంలో రూ.2కోట్లు విడుదల చేయించి దోచుకుని దోచుకున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా టిడిపి నాయకుల మాదిరి తాము రైతుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌డిఒ లక్ష్మీనారాయణ, వైసిపి మండల కన్వీనర్‌ గౌని లక్ష్మీకాంతారెడ్డి, సర్పంచులు కోట్ల ఉమేష్‌రెడ్డి, రాజేష్‌, ఎంపిటిసిలు మారెక్క, గోవిందప్ప, హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గోవిందు నాయకులు ప్రతాపరెడ్డి, నాగిరెడ్డి, రామాంజనేయులు, మాజీ సర్పంచి చిత్ర శేఖరప్ప, రాజు, రాఘవేంద్రారెడ్డి, ఖాజాహుస్సేన్‌, పల్లకిరెడ్డి, నారాయణరెడ్డి, రామాంజనేయులు, బెస్త శ్రీరాములు, తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.

➡️