రూ.10.8 కోట్లతో గుత్తి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి

రైల్వే అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తదితరులు

              గుత్తి : గుత్తి ఆర్‌ఎస్‌లోని రైల్వే స్టేషన్‌ అభివద్ధికి పిఎం నరేంద్ర మోడీ సోమవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. అమత్‌ రైల్వే స్టేషన్ల పథకం కింద గుత్తి స్టేషన్లో రూ.10.8 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. బుకింగ్‌ కార్యాలయం, ప్లాట్‌ ఫారాల పెంపు, విశ్రాంతి భవనాల పునర్‌ నిర్మాణం పనులు చేయనున్నారు. నూతనంగా స్టేషన్‌ భవనాన్నీ ఆధునీకరించనున్నారు. ప్రధాని వర్చువల్‌గా ఈ పనులను ప్రారంభించగా రైల్వే స్టేషన్‌ నుంచి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై,వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.మధుసూదన్‌ గుప్తా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ సంజీవ్‌ కుమార్‌, సీనియర్‌ డిఎంఇ రమేష్‌, స్టేషన్‌ మేనేజర్‌ ఎ.సురేష్‌ బాబు, ఐఒడబ్ల్యు నాగేశ్వర్‌ నాయక్‌, బుకింగ్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినులు చేసిన డాన్సులు, ఎస్పీ బాలసుబ్రమణ్యం కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వరన్‌ పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ డి.వన్నూరుబీ, వైస్‌ ఛైర్‌పర్సన్‌ బి.వరలక్ష్మి, గుత్తి, పామిడి ఎంపిపిలు జి.విశాలాక్షి, బోగాతి మురళీమోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️