సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన

సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన

భూమిపూజ చేస్తున్న వై.విశ్వేశ్వరరెడ్డి,శంకరనారాయణ

ప్రజాశక్తి-ఉరవకొండ

సిఎం జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన సాగుతోందని ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త వై.శంకరనారాయణ అన్నారు. శుక్రవారం కూడేరు మండలంలోని పి.నారాయణపురం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.70 లక్షలతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.కోట్లు వెచ్చించి రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టు నిర్మించినట్లు తెలిపారు. మరోవైపు సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. అభివృద్ధికి కృషి చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నారాయణరెడ్డి, నాయకులు బైరెడ్డి రామచంద్రారెడ్డి, హనుమంతురెడ్డి, నిర్మలమ్మ, సుబ్బమ్మ, తుప్పటి హరీష్‌, చంద్రశేఖర్‌, సుబ్బర ఎర్రిస్వామి, గోవిందరెడ్డి, ఈశ్వరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, సుబ్బర శ్రీధర్‌, హరి, శివ, రామాంజినేయులు, మురళి, కమ్మే రామాంజినేయులు, కుమ్మతి ముత్యాలురెడ్డి, మాధవరెడ్డి, రంగారెడ్డి, నాగరాజు, ఓబుళమ్మ, పద్మావతి, బోయ నరేష్‌, ఎంఎం హళ్లి ఎర్రిస్వామి, ఆదినారాయణ, బొమ్మయ్య, శీనా, రామాంజినేయులు, ఆంజనేయ, భార్గవ్‌, మర్రిస్వామి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️