సాహితీ వైభవం.. సాంస్కృతిక సౌరభం..!

సాహితీ వైభవం.. సాంస్కృతిక సౌరభం..!

తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం అవార్డును అందుకుంటున్న రచయితలు

ప్రజాశక్తి-అనంతపురం

అనంతపురం నగరంలోని జెఎన్‌టియు ఆడిటోరియంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ”అనంత” తెలుగు భాషా వైభవ సదస్సు కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు, ఏపీ సిఆర్‌ మీడియా అకాడమీ ఛైర్‌ పర్సన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వాసంతి సాహిత్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన ”జయహో కష్ణదేవరాయ” నత్యరూపకం ఎంతగానో ఆకట్టుకుంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు కుమారుడు కౌశిక్‌ శ్రీకష్ణదేవరాయలుగా నిర్వహించిన నాటిక సబికులను కట్టిపడేసింది. ”అనంతపురం జిల్లా నాటకం : బళ్లారి రాఘవ” అనే అంశంపై గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ప్రసంగించారు.తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం గ్రహీతలకు జ్ఞాపక, శాలువా, పారితోషికం అందించారు. పదిమందికి ఈ పురస్కారాన్ని అందజేశారు. అందులో ఆచార్య మూడే గోనా నాయక్‌, కంబదూరి షేక్‌ నబీరసూల్‌, చొప్ప వీరభద్రప్ప, జయలక్ష్మి రాజు, జెట్టి జైరామ్‌, డా||ఆదవాని హనుమంతప్ప, డా||ఆమళ్లదిన్నే వెంకటరమణ ప్రసాద్‌, డా||కల్లూరి ఆనందరావు, డా||కేతు బుచ్చిరెడ్డి, సొంటి జయప్రకాష్‌లకు తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం అందించారు. 38 మందికి తెలుగు భాషా సేవా ప్రతిభ పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి విసి చింతా సుధాకర్‌, జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ శశిధర్‌, డిఆర్డిఎ పీడీ నరసింహారెడ్డి, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వరరెడ్డి, డిఈఓ నాగరాజు, డిప్యూటీ డిఈఓ శ్రీదేవి, డివిఈఓ వెంకట రమణ నాయక్‌, అధికార భాషా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

➡️