సిఎం స్పందించకుంటే.. ఉరే గతి..!

Jan 3,2024 09:17

అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

           అనంతపురం కలెక్టరేట్‌ : ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయకపోతే తమకు ఉరేగతి అని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు నిరసన తెలిపారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మె మంగళవారం 14వ రోజుకు చేరుకున్నాయి. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగినులు మెడలో ఉరితాళ్లు వేసుకుని సామూహిక ప్రభుత్వానికి నిరసన తెలిపారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని, లేకపోతే చావేగతి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ ఛైర్మన్‌ విజరు అధ్యక్షతన నిర్వహించిన సమ్మెకు జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్‌లో పని చేస్తున్న కెజిబివి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌లు, మండల స్థాయి అకౌంటెంట్‌లు, సిఆర్‌పిలు, మెసెంజర్‌లు, పార్ట్‌ టైం ఇన్‌స్పెక్టర్‌లు, ఐఆర్‌టిలు, సైట్‌ ఇంజనీర్‌లు, డిపిఒ సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు. రెగ్యులరైజ్‌ చేసేంత వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగులందరూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు రామోమన్‌, సుమంత్‌, నాగరాజ్‌, సాయినీలెస్‌, రాజశేఖర్‌రెడ్డి, మనోహర్‌, లింగరాజు, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

➡️