15 నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

15 నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎపి రైతుసంఘం నేతలు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు ఈనెల 15, 16, 17వ తేదీల్లో కర్నూలులో నిర్వహించనున్నట్లు ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి తెలిపారు. ఆదివారం గణేనాయక్‌ భవన్‌లో కౌన్సిల్‌ సమావేశాల గోడపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూలులో 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే కిసాన్‌ సభా కౌన్సిల్‌ సమావేశాలకు 15న రైతుల మహా ప్రదర్శన బహిరంగ సభ ఏర్పాటు చేయన్నుట్లు తెలిపారు. బహిరంగ సభకు ఏకేస్‌ జాతీయ అధ్యక్షులు అశోక్‌ దావలె, ప్రధాన కార్యదర్శి విజూకృష్టన్‌, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్‌, జాతీయ ఉపాధ్యక్షులు టి.సాగర్‌, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కష్ణయ్య, కే.ప్రభాకర్‌ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. కావున ఈ బహిరంగ సభకు రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పంటలకు మద్దతు ధరలు చట్టం సమగ్ర పంటల భీమా సాగునీటి ప్రాజెక్టులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్తు సంస్కరణలు ద్వారా రైతాంగంపై వేసే బారాలపై అఖిల భారత సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వ పాలనలో రైతుల అప్పుల పాలు అవుతున్నారని, సగటున ప్రతి రైతు కుటుంబానికీ రూ.2.54 లక్షల రుణభారం పడిందన్నారు. రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. రాయలసీమలో ఖరీఫ్‌ రబీ సీజన్‌లో తీవ్రమైన కరువు ఏర్పడిన దృశ్యా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, జిల్లా నాయకులు వి.రామిరెడ్డి, రైతుసంఘం నాయకులు వన్నూరప్ప, శ్రీనివాసులు, పుల్లన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️