15న పెంచిన వేతనాలివ్వాలి

Apr 12,2024 15:27 #Anantapuram District

సిఐటియు ధర్నా

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు పెరిగిన బకాయి వేతనం 21వేలు, డ్రైవర్లకు 24,500 వేల రూపాయలు ఇస్తామన్నా ప్రభుత్వ హామీ మేరకు వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో వచ్చే సోమవారం మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా ధర్నా నిర్వహిస్తామని మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కమిషనర్ హరిబాబుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె పోరాటంలో భాగంగా పోరాడి సాధించుకున్న 21000 వెయ్యి 24,500 రూపాయలు ఇవ్వకపోవడంతో మున్సిపల్ కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అనగా ఈనెల 15వ తేదీన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగును అందులో భాగంగా నగరపాలక సంస్థ మేయరు డిప్యూటీ మేయర్లు మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి ఉన్నత అధికారులు 16 రోజులు సమ్మె పోరాటంలో చర్చల్లో భాగంగా కోవిడు మలేరియా గార్బేజ్ కార్మికులకు 15వేల రూపాయలు ఇస్తామని వారి జీవితంలో ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టే విధంగా అమలు చేస్తామని క్లాప్ ఆటో డ్రైవర్లకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇస్తూ వారికి కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే అనంతపురం పట్టణ ప్రజలకి అనుకూలంగా పారిశుద్ధం 50 మంది కార్మికులను విధులకు తీసుకుంటామని చెప్పి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె విరమణ చేసిన తర్వాత కూడా రెండు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని పాలకవర్గం ఉన్నతాధికారులు ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికే గతం నుంచి ఇప్పటివరకు రెగ్యులర్ కార్మికులు దాదాపుగా 188 మంది రిటైర్మెంట్ ఆయన పోస్టులు ఖాళీగా ఉన్నవి మరల ఇప్పుడు ఈనెల ఏప్రిల్ 30వ తారీకు సంబంధించి 12 మంది రిటైర్మెంట్ కు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పని భారంతో ఇబ్బంది పడుతున్న మున్సిపల్ కార్మికులకు పాలకవర్గం ఉన్నతాధికారులు వారిచ్చిన హామీ మేరకు 50 మంది కార్మికులను తక్షణమే తీసుకోవాలని తెలియజేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ ఐఏఎస్ కు తెలియజేయాలని అడిషనల్ కమిషనర్ హరిబాబుకు వినతిపత్రం అందజేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, నగర రెగ్యులర్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ముత్తురాజు, ఎం నల్లప్ప నగర అధ్యక్ష కార్యదర్శులు బండారి ఎర్రి స్వామి, సాకే తిరుమలేష్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మూర్తి, నాగేంద్ర కుళ్లాయప్ప తదితరులు పాల్గొనడం జరిగినది.

➡️