కాంగ్రెస్‌ అభ్యర్థి విస్తృత ప్రచారం

ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి శంకర్‌

         ఆత్మకూరు : ఆత్మకూరులో మండలంలో ఇండియా కూటమి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదిఆంధ్ర సాకే శంకర్‌ సోమవారం నాడు విస్తృత ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆసుపత్రి నుంచి మిట్టమీది దాకా రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎం.శివశంకర్‌ ఎన్‌పిఆర్‌డి జిల్లా కార్యదర్శి ఎం.రామయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి రాము, ఐద్వా నాయకురాలు వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️