మూఢ విశ్వాసాల నిర్మూలనకు కృషి

మూఢ విశ్వాసాల నిర్మూలనకు కృషి

సమావేశంలో మాట్లాడుతున్న జెవివి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గేయానంద్‌

ప్రజాశక్తి కళ్యాణదుర్గం

మూడ విశ్వాసాల నిర్మూలనక విద్యావంతులు తమవంతు కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ విద్యావంతులు మూఢనమ్మకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టి నిరీక్షణ విముక్తి పరచాలన్నారు. ముఖ్యంగా చేతబడుల కార్యకలాపాలతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మూఢనమ్మకాల పేరుతో వంచిస్తూ మోసం చేస్తున్నారన్నారు. సైన్స్‌ యుగంలో మూఢనమ్మకం లేదనే విషయాలను గుర్తు చేశారు. మూఢనమ్మకంపై పలు రకాల కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అలాంటి నమ్మకాలను పారదోలేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు మల్లికార్జున, చిత్తప్ప, గంగానాయక్‌, లక్ష్మీనారాయణ, ప్రసాద్‌, చిన్న మల్లప్ప, విజయకృష్ణ, శ్రీనివాసులునాయుడు, భగవాన్‌దాస్‌, నాగరాజు, అజరుకుమార్‌, కంబాల నందన్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

➡️