జెవివి ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధి శిబిరం

May 26,2024 13:43 #Anantapuram District

ప్రజాశక్తి-పెనుకొండ : జన విజ్ఞాన వేదిక పెనుకొండ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పెనుకొండ పట్టణంలోని ఘనగిరి స్కూల్ నందు కరస్పాండెంట్ ఇలియాజ్ మూర్ఛ వ్యాధి చికిత్సా శిబిరము ప్రారంభించారు.ఈ శిబిరం నందు 22 మంది వ్యాధిగ్రస్తులకు డాక్టర్. నీలేఖ్య చికిత్స చేశారు. కార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి హరి, పెనుకొండ జోన్ అధ్యక్షులు నబీ, ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, సభ్యులు రమేష్, రామాంజినేయులు, రవి, యశ్వంత్, నాగార్జున పాల్గొన్నారు.

➡️