కార్ డ్రైవింగ్, మెకానిక్ లపై ఉచిత శిక్షణ

May 17,2024 11:15 #Anantapuram District

రూడ్ సెట్ సంస్థ

ప్రజాశక్తి-నార్పల : జిల్లా కేంద్రం అయిన అనంతపురంలో రూడ్ సెట్ సంస్థలో ఈ నెల 20 నుంచి 30రోజుల పాటు యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి ఓ ప్రకటన లో తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాలని తెలిపారు.

➡️