లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేత

Mar 1,2024 15:25 #Anantapuram District
Issuance of registration documents to beneficiaries

ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలన్నదే జగనన్న కల ఎంపీపీ నాగేశ్వరరావు సర్పంచ్ సుప్రియ

ప్రజాశక్తి-నార్పల  : మండల కేంద్రంలోని ఇంటి పట్టాలు పొందిన అర్హులైన లబ్ధిదారులకు శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో 436 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసినట్లు డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీనరసింహులు తెలిపారు. రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నాగేశ్వరరావు మేజర్ పంచాయతీ సర్పంచ్ మన్నేల సుప్రియ ఎంపీడీవో రాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ, సర్పంచ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు వాటిని లబ్ధిదారుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసి జగనన్న ఇస్తున్నాడని మీకోసం ఇంత చేసిన జగనన్న రుణం ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలని పేదల పక్షపాతి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకారం అంద చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఉండడానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తమను జగనన్న తమ కుటుంబ సభ్యులుగా భావించి ఇంటి స్థలాన్ని అందజేశారని ఆజన్మాంతం ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గూగూడు ఎంపీటీసీ రాజారెడ్డి వైసీపీ నాయకుడు.మన్నిల శివయ్య, మోహన్, చికెన్ గోపాల్, రమేష్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది వీఆర్వోలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అర్హులకు న్యాయం చేసి అనహర్హుల పేర్లు తొలగించండి ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లప్ప మండల కేంద్రమైన నార్పలలో కొందరు అనార్హులు, ఇంటి స్థలాలు ఉన్నవారు సొంత ఇండ్లు ఉన్నవారు కూడా ఇంటి పట్టాలు పొందారని అటువంటి అనహర్హులను తొలగించి అర్హులైన నిరుపేదలకు ఇల్లు లేని వారికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లప్ప తదితరులు అధికారులను కోరారు. డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ ఎవరైనా అనహర్హులు ఉంటే అటువంటి పట్టాలు రద్దు చేస్తామని తెలిపారు.

➡️