మున్సిపల్ కార్మికులందరికీ ఇల్లు మంజూరు చేయాలి

Mar 4,2024 17:05 #Anantapuram District

అర్బన్ తహసిల్దార్ ఆఫీసు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగర పాలక సంస్థ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఇంజినీరింగు కార్మికులకు. ఇళ్ల పట్టాలు జగనన్న ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, మునిసిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. నాగభూషణo, సీఐటీయూ నగర కార్యదర్శి వై వెంకటనారాయణ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ పాలకులు మారుతున్నారు. కానీ మునిసిపల్ కార్మికుల తల రాత మాత్రం నేటికీ మారలేదు, అని గత ప్రభుత్వాలు మోసం చేసారు. ప్రస్తుత ప్రభుత్వం కూడ మునిసిపల్ కార్మికుల్ని మోసం చేసి జగనన్న ఇల్లుకి అనర్హులుగా చేస్తూ ఇల్లు స్థలాలు మంజూరు చేయని పరిస్తితి నెలకొందన్నారు. డిసెంబర్, జనవరి నెలలో రాష్ట్రా వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులుగా సమ్మె చేయగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మునిసిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చిన నేటికీ అమలు చేయటం లేదు. అని తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. తహశీల్దార్ స్పందిస్తూ పరిశీలన జరిపి కలెక్టరు కు పంపుతామని చెప్పారు.నాయకత్వం మాట్లాడుతు మునిసిపల్ కార్మికులు ఏది ఏమైనా ఉప్పర పల్లి పంచాయితీ యందు రాళ్ల గుట్ట భూమి లో కార్మికులందరూ గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కావున ఆ భూమిని మున్సిపల్ కార్మికుల కు కేటాయించి వెంటనే డీ పట్టా లు ఇవ్వాలని లేని పక్షంలో భవిష్యత్ పోరాటాలకు చేయాల్సి వస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు బండారి ఎర్రి స్వామి, తిరుమలేశు పర్మనెంట్ కార్మికుల యూనియన్ నగర అధ్యక్ష లు ల్.ముత్తు రాజు, కోశాధికారి నారాయణస్వామి, మహిళ నాయకురాల్లు మంత్రి వరలక్ష్మి,లక్ష్మీనారాయణ ,నాగేంద్ర ,సర్దనమ్మ,మరియమ్మ కృపమ్మ , రవి, ఆది నారాయణ, శ్రీనివాస మూర్తి,తదితరులు పాల్గొన్నారు.

➡️