పొర్లుదండాలు, అరగుండులతో కార్మికుల నిరసన

Jan 5,2024 17:03 #Anantapuram District
municipal workers strike 11th day atp

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజైనా శుక్రవారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్మికులు దండాలు పెట్టి అరగుండ్లు గీయించుకుని అరగుండ్లు గీయించుకొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపుగా వెళ్లి అంబేద్కర్ కు పూలమాల వేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కే మంచి బుద్ధుని ప్రసాదించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే శనివారం నుండి సమ్మె ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సెక్రెటరీ నాగేంద్ర కుమార్, సిఐటియు ఒకటో పట్టణ కార్యదర్శి వెంకట్ నారాయణ, మున్సిపల్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు బండారి ఎర్రి స్వామి కార్యదర్శి సాకే తిరుమలేష్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నల్లప్ప, ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున రాయుడు, ఓబుళపతి, పోతులయ్య,  లక్ష్మీనరసింహ మంత్రి వరలక్ష్మి, రాఘవేంద్ర ప్రసాద్ ఆది, తదితరులు పాల్గొన్నారు.

➡️