ఇందిరానగర్ లో పట్టణ ప్రగతి యూనిట్ ప్రారంభం

Jan 13,2024 16:42 #Anantapuram District
pragati nagar start

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని 49వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ లో శనివారం పట్టణ ప్రగతి యూనిట్ ను మేయర్ మహమ్మద్ వసీం కమిషనర్ భాగ్యలక్ష్మి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ విజయలక్ష్మి స్థానిక కార్పొరేటర్ మునిశేఖర్ డిప్యూటీ మేయర్ లు విజయభాస్కర్ రెడ్డి వాసంతి సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రగతి యూనిట్ కింద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పై స్కిల్ డెవలప్మెంట్ తో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించి ఈ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. సబ్సిడీ రూపంలో 33,702 రూపాయల నగదు అందజేశారు ఆసక్తిగల స్వయం సహాయక సభ్యులు ఇటువంటి యూనిట్లను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి సంఘాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పట్టణ ప్రగతి యూనిట్ల క్రింద పేపర్ ప్లేట్ల తయారీ క్లాత్ బ్యాగ్స్ తయారీ ఆర్టిఫిషియల్ జువెలరీ కర్పూరం తయారీ సాంబ్రాణి తదితరాలు కారం మసాలా పౌడర్ మిల్లెట్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చునని మెప్మా అధికారులు తెలిపారు. ఈ ఆరు ట్రేడ్ల క్రింద నైపుణ్యం ఉన్న మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

➡️