18న షర్మిల పర్యటన

18న షర్మిల పర్యటన

విలేకరులతో మాట్లాడుతున్న శైలజానాథ్‌

శింగనమల : నియోజకవర్గ పరిధిలోని నార్పల మండలంలో ఈనెల 18న పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పర్యటిం చనున్నట్లు కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ ఉమ్మడి అభ్యర్థి సాకే శైలజానాథ్‌ తెలిపారు. సోమ వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఎజెండా లేకుండా ఎన్నికలకు వెళ్తున్నాయన్నా రు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. పంట నష్టపోయిన రైతు లకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా వంటి వాటివి సకాలంలో అందించి ఆదుకున్నామన్నారు. ఆ యా పథకాలు తిరిగి సక్రమంగా కొనసాగాల ంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. కాగా 18న సాయంత్రం నార్పలలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో షర్మిల పాల్గొననున్నట్లు తెలిపారు. కావున కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఒబిసి ఛైర్మన్‌ జె.రామ్‌చరణ్‌ యాదవ్‌, సూరినాయుడు, ఆదినారాయణ, మురళీ, రాముడు, వెంకట్‌రాముడు, కొండా పకీరప్ప పాల్గొన్నారు.

➡️