మీ ఆడబిడ్డగా వచ్చా.. ఆదరించండి..: శ్రావణిశ్రీ

మీ ఆడబిడ్డగా వచ్చా.. ఆదరించండి..: శ్రావణిశ్రీ

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-నార్పల

‘మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చా.. మీలో ఒక్కరిగా ఉంటా.. వచ్చే ఎన్నికల్లో ఆదరించండి..’ అంటూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొచ్చా.. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి… పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు గురించి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేయాలి’ అంటూ పిలుపునిచ్చారు. తాను ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ సేవకురాలిగా పని చేస్తానన్నారు. ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మరోసారి వైసిపి వస్తే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. ఇసుక మాఫియాలు ఉద్భవించడంతోపాటు నిత్యా వసర ధరలు ఆకాశాన్ని అంటుతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేగా తననూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు, మాజీ ఎంపిపి ఆకుల అరుణ, సీనియర్‌ నాయకులు ఆకుల ఆంజనేయులు, ఆలం నాగార్జున, ఆకుల ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️