భారీ మోజార్టీతో గెలవబోతున్నాం..!

ప్రచారంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌కు భారీ గజమాలతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

       అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. రుద్రంపేట పంచాయతీలో సోవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ తమకు ఎక్కడికి వెళ్లినా విశేష జనస్పందన కనిపిస్తోందన్నారు. తమ విజయం ఎప్పుడో ఖాయమైందన్నారు. కాలనీలో రజకుల సమస్యలు ఎక్కువగా కనిపించాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్తగా దోబీఘాట్లు నిర్మిస్తామన్నారు. కాలనీల్లో డ్రెయినేజీలు, వీధి లైట్లు వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వర్షాలకు సిమెంట్‌ రోడ్లు కొట్టుకుని పోయాయన్నారు. ఈ పంచాయతీ చూస్తే ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, రాష్ట్ర నాయకుడు కొండవీటి సుధాకర్‌ నాయుడు, మాజీ మేయర్‌ స్వరూప, మాజీ ఎంపీపీ శ్రీనివాస రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గోపాల్‌ గౌడ్‌, టిడిపి నగర అధ్యక్షుడు మారుతీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంచిరోజులు వస్తున్నాయి పోస్టర్‌లు ఆవిష్కరణ

           వచ్చే నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టబోయే ర్యాలీ, గడప గడపకు ప్రొగ్రాం కార్యక్రమం సంబంధించి మంచి రోజులు వస్తున్నాయి పోస్టర్‌లను అనంతపురం అర్భన్‌ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ఆవిష్కరించారు. బెంగళూరు టిడిపి ఫోరం, తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ నేతలతో కలిసి నియోజకవర్గం కార్యాలయంలో పోస్టర్‌లను ఆవిష్కరించారు.

➡️