సిఎం జగన్‌కు ఉత్తరాలు రాసిన అంగన్వాడి కార్యకర్తలు

Dec 28,2023 15:18 #Anganwadi strike, #ongle

 ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) : కందులాపురం సెంటర్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నందు కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల అంగన్వాడీ కార్యకర్తలు సిఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కార్యాలయానికి ఉత్తరం ద్వారా వారి యొక్క సమస్యను వ్రాసి పంపడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సమస్యలను ఉత్తరాల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ షేక్‌ అన్వర్‌ భాష, సిఐటియు నాయకులు వెంకట్‌ కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మూడు మండలాల అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️