తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Jun 11,2024 11:22 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని తెలిపారు. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్‌ మెంట్లలో యాత్రికులు ఉన్నారని.. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన యాత్రికులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. కాగా నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

➡️